President of South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడి పై అరెస్ట్ వారెంట్ జారీ ..! 7 d ago
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ వివాదంలో ఇప్పటికే అభిశంసనను ఎదుర్కొంటున్నారు. యూన్ ను అరెస్టు చేసేందుకు దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అంగీకరించినట్లు వెల్లడించారు. సియోల్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు అరెస్టు వారెంట్ ను జారీ చేసినట్లు ఉన్నతస్థాయి అధికారులు తెలిపారు. త్వరలోనే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. దీనిపై స్పందించేందుకు కోర్టు నిరాకరించింది.